తెలంగాణ రైతులకు గుడ్న్యూస్. జులై మొదటి వారం నుంచే దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మాఫీలో భాగంగా మొదటగా రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారట. ఇందుకు సుమారు రూ.6,000 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. తర్వాత రూ.లక్షన్నర వరకు అమలు చేసే అవకాశం ఉండగా, దీనిలో రూ.6,500 కోట్లు అవసరమని తెలిసింది. ఈ రెండు దశల్లోనే సుమారు రూ.16 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ జరగనుంది. మిగిలిన రైతు కుటుంబాల్లో రూ.2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికీ, సంస్థలకు ఉన్న భూములకు, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ ఎకౌంటెంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారి భూములకు రుణమాఫీ అమలు ఉండదు. సుమారు 26 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అంచనా.