అగ్రి గోల్డ్ భూమి వివాదం… అడ్డంగా బుక్కైన జోగి రమేష్

-

విజయవాడ రూరల్ నియోజకవర్గం అంబాపురంలోని అగ్రి గోల్డ్ భూమిని అక్రమంగా అమ్మేశారంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ పై విమర్శలు వెల్లువెత్తాయి.సర్వే నెంబర్ 87లోని 2160 గజాల అగ్రిగోల్డ్ భూములను 2018లో సీఐడీ అటాచ్ చేసింది. అయితే ఆ భూములను జోగి రమేశ్ కుమారుడు రాజీవ్, బంధువులు వెంకటేశ్ కొనుగోలు చేశారు.

ఇక ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి 87 సర్వేను 88గా మార్చి ఆ భూములను 300, 400 గజాల ప్లాట్లుగా చేసి జోగి రమేష్ ఇతరులకు అమ్మేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని కోణాల్లో పత్రాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే రాజకీయంలో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news