దేశంలో కరువు సహా ఇతర పరిస్థితులు ప్రజలను మరింత దిగజారుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో బతకాలి అంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో కూడు గుడ్డ అనే హామీలు ఇస్తున్నా సరే ప్రజల్లో మాత్రం కొన్ని కష్టాలు తొలగిపోయే పరిస్థితి కనపడటం లేదు. దీనితో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పిల్లలను కనాలి అంటేనే భయపడిపోతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళే కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉందని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్పీ విభాగం ఛైర్మన్ నితిన్ రౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు తాజాగా రాసిన ఒక లేఖలో సంచలన విషయాలు బయటపెట్టారు. చెరకు తోటల్లో పనిచేస్తున్న 30వేల మంది పేద కూలీలు తమ గర్భాశయాలను తొలగించుకున్నారని, రుతు సమయంలో పేద మహిళలు కూలీ పనికి వెళ్లలేక పోవడం వల్ల వేతనాలు రావనే భయంతో చెరకు తోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలు హిస్టరెక్టమీ శస్త్రచికిత్స చేయించుకొని,
తమ గర్భాశయాలను తొలగించుకున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ భూమి లేని నిరుపేద మహిళలు తమ జీవనం కోసం చెరకు తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. జీవనాధారం కోసం తమ గర్భాశయాలను తొలగించుకున్న మహిళలను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నారు. కూలి పనుల కోసం అమ్మ తనాన్ని వదులుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఈ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.