మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నానిపై కేసు నమోదు అయింది. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాలంటీర్లు.
ఈ తరుణంలోనే మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసిపి నేతలపై 447,506,R/w34 ఐపిసి సెక్షన్ల…. కింద కేసు నమోదు చేశారు గుడివాడ వన్ టౌన్ పోలీసులు.
కాగా వైసీపీ నేతలపై కేసులు పెడితేనే.. విధుల్లోకి తీసుకుంటామని అచ్చెన్నాయుడు ఇటీవలే ప్రకటించారు. లేకపోతే వార్డు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ వ్యాప్తంగా వైసీపీ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు వార్డు వాలంటీర్లు. కాగా… ఎన్నికల కంటే ముందే… టీడీపీ వ్యతిరేకంగా కొంత మంది వార్డు వాలంటీర్లు రాజీనామా చేశారు.