బాపట్ల జిల్లాలో యువతిపై అత్యాచారం అయిన తరుణంలో..రూ.10 లక్షలు ప్రకటించారు హోం మంత్రి అనిత. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలో బహిర్బుమికి వెళ్లిన సుచరిత (21) అనే యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు కొందరు దుండగులు. దీంతో డాగ్ స్కాడ్‌తో రంగంలో దిగిన పోలీసులు….నిందితుల కోసం గాలిస్తున్నారు.
అయితే..నిన్న బాపట్లలో సుచరిత(21) అనే యువతి అత్యాచారం, హత్యకు గురైన సంఘటన స్థలానికి వెళ్లారు హోం మంత్రి అనిత. 48 గంటల్లో నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చి బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు హోంమంత్రి అనిత. కాగా, చీరాల మండలం ఈపురుపాలెంలో హత్యకు గురైన సుచరిత గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అదుపులోకి తీసుకున్న నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారట పోలీసులు..