హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. నేడు(ఆదివారం), రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉన్నట్లు పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ చేశారు. ఈ మూడు జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందట.