ఏపీలో నేటి నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ప్రారంభం

-

ఏపీలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించిన సర్కార్ ఇప్పుడు ప్రజాసంక్షేమంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ వెబ్ పోర్టల్ ఇవాళ (సోమవారం) ఉదయం 9 గంటలతు  ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అర్జీలను ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆధార్, ఫోన్‌ నంబరు ఇవ్వాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారు. దాని ఆధారంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news