18వ లోక్​సభ తొలి సమావేశం.. ప్రొటెం స్పీకర్​గా భర్తృహరి ప్రమాణం

-

18వ లోక్​సభ సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభం అయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్​గా భర్తృహరి మహతాబ్​ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మరికొద్ది సేపట్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానల్‌ ఆఫ్‌ ఛైర్‌పర్సన్లతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు.

కేబినెట్‌ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ప్రారంభం కానుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులు అల్ఫాబెటిక్ ఆర్డర్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ సభ్యుల్లో అండమాన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు బిష్ణుపదరే తొలుత ప్రమాణం చేస్తారు. చిట్టచివరన బంగాల్​కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు బీర్‌భూమ్‌ శతాబ్దిరాయ్‌ ప్రమాణం చేయనున్నారు. లోక్‌సభలో గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news