ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ షేక్‌హ్యాండ్‌

-

PM, Rahul Gandhi Shake Hands: ప్రధాని మోదీకి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు రాహుల్ గాంధీ. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైన సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓం బిర్లాకు అభినందనలు తెలిపిన రాహుల్ గాంధీ వెంటనే తన పక్కన ఉన్న ప్రధాని మోదీకి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. అనంతరం స్పీకర్‌ను తన చైర్ వరకు తీసుకెళ్లారు.

PM, Rahul Gandhi Shake Hands As They Welcome Lok Sabha Speaker Om Birla

కాగా, 48 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరిగింది. బుధవారం రోజున జరిగిన ఈ ఎన్నికల్లో 18వ లోక్​సభ స్పీకర్​గా ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు. అలా ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు ప్రధాని మోదీ సహా ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ తరఫున కూడా శుభాభినందనలు తెలియజేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news