భారత లోక్ సభలో పార్లమెంట్ సభ్యులందరూ ఈనెల 24, 25 తేదీలలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడంతో కాంగ్రెస్ స్పీకర్ కోసం ఎంపీ సురేష్ ని బరిలోకి దింపింది. దీంతో ఇవాళ స్పీకర్ ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓం బిర్లా విజయం సాధించారు. పార్లమెంట్ ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో ఇండియా కూటమి నేతలు నిరసన వ్యక్తం చేశారు.
హోరా హోరీ నిరసన మధ్య ఇవాళ లోక్ సభ వాయిదా పడింది. ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులు అని పేర్కొన్నారు స్పీకర్ ఓం బిర్లా. అధికార, విపక్ష సభ్యుల నిరసనలతో లోక్ సభ హోరెత్తింది. ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన చేశారు. ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు స్పీకర్ ఓం బిర్లా. ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. లోక్ సభ రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.