ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు : సీఎం రేవంత్

-

పార్టీ ఫిరాయింపులకు పునాది వేసింది మాజీ సీఎం కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్‌ లాక్కున్నారని పేర్కాన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్‌, హరీశ్‌ అన్నారని రేవంత్ గుర్తు చేశారు. వాళ్ల మాటలకు అప్పట్లో బీజేపీ వంతపాడిందని వ్యాఖ్యానించారు.

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్పై, బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. “ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్ఎస్, బీజేపీ రంకెలేశాయి. ప్రభుత్వాన్ని కూలగొడతామంటుంటే మేం గాలికి వదిలేయాలా? ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్‌ భావదారిద్య్రం. కేసీఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కలగలేదు. రాష్ట్రావతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించాం. రాష్ట్రావతరణ దినోత్సవంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.” అని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news