సూరజ్‌ రేవణ్ణ కేసు.. అమావాస్య రోజు ఎర్ర చీర, నల్లగాజులతో సింగారం!

-

కర్ణాటకలో దేవగౌడ కుటుంబంలోని వారసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే లైంగిక దాడులు, వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ కూడా అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నట్లు సమాచారం. సూరజ్ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకునేవాడని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

“నాకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్‌ పరిచయం అయ్యాడు. అప్పుడు నా ఫోన్‌ నంబరు తీసుకుని, విజిటింగ్‌ కార్డు ఇచ్చాడు. నిత్యం గుడ్‌మార్నింగ్‌తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడు. నన్ను ఫాంహౌస్‌కు పిలిపించుకుని, కాళ్లు ఒత్తమని కోరాడు. ఆ తర్వాత బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. చీరకట్టుకుని, గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్‌ఫోన్లో ఉన్నాయి.” అని విచారణ అధికారులకు బాధితుడు వివరించాడు. ఆ ఫోన్‌ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news