బ్రేకింగ్‌ : ముగిసిన‌ కేబినెట్ మీటింగ్‌.. ఏం తేల్చారంటే..?

-

ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. రెండు గంటల పాటు భేటి అయిన మంత్రివర్గం రాజధాని అమరావతితో పాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇందులో ప్రధానంగా రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టును సీఎం జగన్, మంత్రులు చర్చించారు. అమరావతిలో పరిస్థితులు, విశాఖలో పరిపాలనా పరంగా రాజధాని ఏర్పాటు ప్రతిపాదన, రాజధానిలో రైతులకు ఎలా న్యాయం చెయ్యాలి? ఇలాంటి అంశాలన్నింటిపైనా చర్చించారని తెలిసింది. ఐతే… కేబినెట్‌ సమావేశంలో ప్రస్తుతానికి రాజధాని అంశంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది.

ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చే పూర్తిస్థాయి నివేదిక కీలకం కానుంది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రాజధాని అంశంపై ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిపైనా ఇవాళ్టి కేబినెట్ మీటింగ్‌లో చర్చ జరిగింది. ఆ సంస్థ జనవరి 3న పూర్తి స్థాయి నివేదిక ఇస్తుందని తెలిసింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాతే… రాజధానిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా రాజధాని అంశంపై కేబినెట్ సబ్ కమిటీని వెయ్యాలని కేబినెట్ చర్చించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news