వైరల్ వీడియో..ఈ వీడియో చూస్తే భావోద్వేగానికి గురవడం ఖాయం…!

-

భారత్ లో క్రికెట్ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ ని ఒక మతంగా కులంగా చూస్తారు భారతీయులు. చిన్న పిల్లల్లో కూడా క్రికెట్ కి అమితమైన క్రేజ్ ఉంటుంది. దేశం మొత్తం కూడా ఈ ఫీవర్ ఉంది. పిల్లలు సెలవు వచ్చింది అంటే చాలు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా దీనికి బానిసలే. వయసుతో సంబంధం లేకుండా క్రికెట్ ఆడటం మనం దేశంలో చూస్తూ ఉంటాం. బ్యాట్ బంతి ఉంటే చాలు పిల్లలు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపిస్తారు.

తాజాగా సుధా రామన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో ని పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఒక అంగవైకల్యం ఉన్న పిల్లవాడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. బంతి ఆడి అతను పరిగెత్తే విధానం కన్నీళ్లు తెప్పిస్తుంది. “నన్ను మాట్లాడకుండా వదిలేయండి! #DeterminedMind క్రికెట్‌ను ఇష్టపడే వారందరికీ మరియు ఇష్టపడనివారికి కూడా తప్పక చూడాలి. దీన్ని FB లో చూడాలి, వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ అబ్బాయి గురించి అని ఆమె పోస్ట్ చేసింది.

చాలా మంది ట్విట్టర్ యూజర్లు పిల్లవాడిని అతని ఉత్సాహానికి ప్రశంసించారు మరియు అతన్ని హీరో అని పిలిచారు, ఇతరులు అతనిని తమతో సమానంగా భావించినందుకు ఇతర పిల్లలను అభినందించారు. ఆ బాలుడి వివరాల కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అతని కలలను తాము సాకారం చేస్తామని ముందుకి వస్తున్నారు. ఇక ఆ పిల్లలు అతనికి ఇస్తూ విలువ చూసి సమాజం ఆదర్శంగా తీసుకోవాలని, అతని స్పూర్తిని అందరూ కొనసాగించాలని, ఇక ఆ పిల్లాడి హుషారు చూసి అందరూ ఫిదా అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news