టీడీపీకి బంపర్ ఆఫర్.. ఆ ఎంపీకి డిప్యూటీ స్పీకర్ పదవీ..?

-

దేశంలో ఎన్డీఏ కూటమి మూడో సారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న స్పీకర్ గా రెండో సారి ఓం బిర్లా ఎన్నికైన విషయం తెలిసిందే. తొలుత ఏకగ్రీవంగా జరుగుతుందనుకున్నా.. ప్రతిపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవీ అడగడంతో ఎన్డీఏ కూటమి ఇవ్వలేదు. దీంతో స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్  ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు.

మూజు వాణి ఓటుతో ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంప్రదాయం ప్రకారం.. డిప్యూటీ సీఎం పదవి తమకు ఇవ్వాలంటూ ఇండియా కూటమి పట్టుబడుతోంది. ఈ మేరకు ఆ పదవిని ఎలాగైన దక్కించుకునేందుకు అన్ని పార్టీ మద్దతును కూడగడుతోంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ప్రధాని మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీకి డిప్యూటి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీలో రూమర్స్ వినిపిస్తున్నాయి.  ఇటీవలే బాపట్ల నుంచి ఎంపీగా విజయం సాధించిన మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news