T20 World Cup 2024: సెమీస్ లో ఇంగ్లాండ్ చిత్తు అయింది. దీంతో ఫైనల్స్ కు చేరింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీం ఇండియా దూసుకెళ్లింది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి మూడోసారి ఫైనల్ లో అడుగుపెట్టింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండు 103 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆ జట్టులో బట్లర్(23), హ్యరీ బ్రూక్(25) కాసేపు పోరాడారు. మిగతా వాళ్ళంతా ఘోర వైఫల్యం చెందారు. భారత బౌలర్లను అక్షర్ పటేల్, కుల్దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశారు. ఇది ఇలా ఉండగా…టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. డగౌట్ లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు.
సహచర ఆటగాళ్లు ఆయనను ఓదారుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, రోహిత్ ఐసిసి టోర్నమెంట్లలో 27 మ్యాచ్ లకు సారథ్యం వహించారు. అందులో 24 మ్యాచుల్లో జట్టును గెలిపించారు. నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. విన్నింగ్ పర్సంటేజీ 81.47%గా ఉంది.