పీసీసీ పదవి రాకుండా పెద్ద లీడర్లకు చెక్ పెడుతున్నారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క, బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ పేర్లను అధిష్టానం ముందు ఉంచారట రేవంత్ రెడ్డి.
మంత్రి పదవి రాకపోతే టీపీసీసీ అధ్యక్ష పదవి అయినా తీసుకుందామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి అనుకుంటుండగా వీళ్లకు చెక్ పెట్టేందుకు చూస్తున్నారట రేవంత్ రెడ్డి. ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. ఈరోజు(శుక్రవారం) కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరగనున్న పర్యటన యథావిథిగా రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, పీసీసీ చీఫ్, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, తదితర విషయాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.