ప్రభాస్ కల్కి మూవీపై కేజీఎఫ్ స్టార్ యశ్ ప్రశంసల వర్షం

-

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది. ఇక ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా శుక్రవారం కేజీఎఫ్ స్టార్ యశ్ కూడా స్పందించాడు. “విజువల్ గా ఓ అద్భుతమైన సరికొత్త లోకముని క్రియేట్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్ కు నాశుభాకాంక్షలు. మరింత క్రియేటివ్ గా స్టోరీలు చెప్పడానికి ఈ మూవీ ఒక దారి చూపిస్తుంది. మరింత మంది ఓ పెద్ద అడుగు వేసేలా నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ విజన్ స్ఫూర్తిగా నిలవనుంది అని అన్నారు. ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్ సర్, కమల్ హాసన్ సర్, దీపికా పదుకోనే, ఇతర అతిథి పాత్రలను కలిసి చూడటం ఎంతో అద్భుతమైన అనుభవం. ఇది నిజంగా స్క్రీన్ ను మరింత ఆనందింప చేసింది” అని యశ్ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేయడం విశేషం. ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news