దిశగా నటించడానికి సమంత రెడీ..

-

దిశ అత్యాచారం, హత్య” ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెటర్నరి డాక్టర్ గా పని చేస్తున్న దిశని అత్యాచారం చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేసారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు కూడా పోయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న,

అనేక ఘటనలు కూడా మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసాయి. దిశ నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపేశారు కూడా. దీనితో దేశ వ్యాప్తంగా తెలంగాణా పోలీసుల తీరుపై పలువురు ప్రసంశల వర్షం కురిపించారు. వాళ్ళు సరిగా సమాధానం చెప్పారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే అలాంటి చర్యలే సరైనవి అంటూ కొనియాడారు. అది అలా ఉంచితే ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా,

సినిమా తీయడానికి గాను తమిళ దర్శకుడు శరవణ సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన దీని మీద కథను కూడా సిద్దం చేసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కథ మీద ఆయన ఫోకస్ పెట్టారని, త్వరలోనే సెట్స్ పైకి సినిమా వెళ్తుందని అంటున్నారు. ఈ సినిమాలో దిశ పాత్ర కోసం ఆయన సమంతాని ఎంపిక చేసారట. ఇప్పటికే లేడీ ఓరియే౦టెడ్ సినిమాల్లో సమంతా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనితో ఆ పాత్రకు ఆమె అయితేనే సరిపోతుందని దర్శకుడు భావించాడట.

Read more RELATED
Recommended to you

Latest news