నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు కూడా అదే బాటలో నడుస్తోంది. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగింది. దీంతో 40,450 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 37,100 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి ఒక్కసారిగా 1300 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 49,100 రూపాయల వద్దకు ఎగబాకింది.
ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పై పైకి కదిలాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు పెరిగింది. దీంతో 39,100 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,900 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 1300 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 49,100 రూపాయల వద్దకు చేరుకుంది.