ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే కేంద్ర ప్రకటించిన నగదుతో విశాఖ నగరంలో పలు శంకుస్థాపనలు చేయనున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో రూ.905.50 కోట్లు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో రూ.379.82 కోట్ల మేర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇక మరో విషయం ఏంటంటే.. విశాఖలో త్వరలో GVMC ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ అక్కడ పరిపాలనా రాజధానిని పెట్టాలనుకుంటున్న వైసీపీ… ఆ ప్రకటనతో వచ్చిన మైలేజ్‌ని ఉపయోగించుకొని… GVMC ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు… అందుకు ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న జగన్… తన పరిపాలనకు మంచి మార్కులే పడ్డాయి అనిపించుకునేందుకు GVMC ఎన్నికల్ని ఫలితాల్ని లెక్కలోకి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవాలని వైసీపీ వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయి.