అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 23738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాల్లో కలదని అన్నారు. అటవీ హద్దులను నిర్ధారించుటకు మరి ఆక్రమణల తొలగించుటకు అటవీ రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వే పూర్తి చేయాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న అటవీ బ్లాక్ లను తగినట్లు నోటిఫై చేయుటకు వివాదాలను తొందరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ రికార్డులలో అటవీ బ్లాక్ లను చేర్చాలని, వన్యప్రాణుల సంరక్షణకు, వేసవికాలంలో మంటల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాస్,ఫారెస్ట్ రేంజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.