త్రిపురలో షాకింగ్ ఘటన.. ఏకంగా 828 మంది విద్యార్థులకు HIV పాజిటివ్..!

-

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైనటువంటి త్రిపురలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ మొత్తం 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు వెల్లడించారు. అందులో ఇప్పటికే 47 మంది మృతిచెందగా.. 572 మంది బతికే ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే పేరు పొందిన విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు త్రిపుర నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.

రాష్ట్ర వ్యాప్తంగా యువత  డ్రగ్స్ కి బానిసలు అవుతుండటంతో ఇటీవలే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు 220 పాఠశాలలు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు భారీగా డ్రగ్స్ ఇంజక్షన్స్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. అయితే, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులు తీసుకున్న ఇంజక్షన్ మరొకరు వాడుతుండటంతో ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఇలాగే కొనసాగితే రోజు రోజుకు HIV కేసుల సంఖ్య మరింత పెరిగే అవకావం కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడుతాయో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news