ఏపీలో జరిగిన మరో ఎన్నికలో టీడీపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. బెజవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ కైవసం చేసుకుంది టీడీపీ పార్టీ. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీ పార్టీ. టీడీపీలోని ఓ వర్గాన్ని అడ్డం పెట్టి ఛాంబరును చేజిక్కించుకునే ప్రయత్నం చేసింది వెలంపల్లి వర్గం. వెలంపల్లి వర్గానికి చెక్ పెట్టారు టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్.
కాగా 15 ఏళ్లుగా వెలంపల్లి వర్గీయులు చేతి లో ఉన్న ఛాంబర్ ను కైవసం చేసుకుంది టీడీపీ పార్టీ.
ఈ సారి విజయవాడ ఛాంబర్ పీఠమెక్కనున్నారు డూండీ వర్గీయులు. ఇక దీనిపై టీడీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో కూడా తెలుగు దేశం పార్టీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.