విద్యుత్ శాఖ పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

-

విద్యుత్ శాఖ పై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తవ్విన కొద్ది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బయటికి వస్తుంది. ఏ శాఖ చూసినా తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014-19 నుంచి విద్యుత్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రూ.5వేల కోట్ల గ్రాంట్ తీసుకొచ్చాం.

అంతకుముందు ప్రపంచ బ్యాంకు నుంచి 2వేల నుంచి 3వేల కోట్లు విద్యుత్ కి తీసుకొచ్చినట్టు గుర్తు చేసారు. ఈ పిరియడ్ లోనే ఎక్కువగా విద్యుత్ ను అబివృద్ధి చేశామని తెలిపారు. దేశంలో ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ ఏపీలోనే వచ్చింది. దాని వల్ల డిస్ట్రిబ్యూషన్ పెరిగింది. 1995-2004 వరకు ఏపీలో విద్యుత్ సంస్కరణలు చేపట్టాం. 2014-19 వరకు రెండో దశ సంస్కరణలు చేపట్టాం. 2019-23 వరకు చార్జీలు పెరిగాయి. అప్పులు చేశారు. 2024-29 వరకు మూడో దశ సంస్కరణలు చాలా అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news