కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

-

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసిలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టపై సమీక్ష చేపట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష కొనసాగుతుంది. ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరించారు.

మరోవైపు.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించండి.. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు రేవంత్ శంకుస్థాప‌న చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news