మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై రేపు మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

-

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, తీసుకున్న చర్యలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోసారి సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు బుధవారం అధికారులు, ఇంజనీర్లతో సమావేశమైన ఆయన ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు అనుగుణంగా తీసుకున్న చర్యలు, పరీక్షలపై ఇంజనీర్లు వివరించగా రేపు మరోసారి పూర్తిస్థాయిలో సమీక్షిద్దామని తెలిపారు.

నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై కేంద్ర జలసంఘంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు. ఎన్జీటీ వ్యవహారాలపై కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సిఫార్సులపై వీలైనంత త్వరగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. అన్ని స్థాయిల్లో పదోన్నతులు వెంటనే పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news