జనసేనకు మరో కీలక పదవి దక్కింది. తెలుగు దేశం పార్టీ కూటమి సర్కారు ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన జనసేనకు సీఎం చంద్రబాబు మరో కీలక పదవి అప్పజెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) పదవిని కూడా జనసేన పార్టీకి కేటాయించారు.
ఇటీవల అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అవకాశం రాగా.. రెండో కీలక స్థానమైన AAG పదవిని జనసేనకు ఇచ్చారు. జనసేన లీగల్ వ్యవహారాల సలహాదారు సాంబశివ ప్రతాప్‌కు ఈ పదవి దక్కింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ,బీజేపీతో కలిసి 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఫుల్ స్ట్రైక్ రేట్ సాధించింది. పవన్ సపోర్ట్ తో టీడీపీకి ఏపీలో ఫుల్ మైలేజీ వచ్చింది. అయితే అన్ని సీట్లను గెలిచిన జనసేనకి కేవలం మూడు మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. దీంతో జనసేన కేడర్ లో అసంతృప్తి నెలకొంది.
ఈ అసంతృప్తిపై పార్టీ అధినేతకు సమాచారం అందింది. అయితే జనశ్రేణులను మరింత ఉత్సాహపరిచేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) పదవిని కూడా జనసేన పార్టీకి కేటాయించారు.