అసెంబ్లీ డుమ్మా కొట్టడానికే ఢిల్లీలో ధర్నా – జగన్‌ పై నాగబాబుపై ఫైర్‌

-

జగన్‌ కు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్‌ ఇచ్చారు. శవ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ నాయకుణ్ణి ప్రజలు నమ్మడం లేదని.. గత ప్రభుత్వంలో చలనం లేని మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఇప్పుడు జనం గుర్తుచ్చారా..? అని ప్రశ్నించారు. జగన్ దొంగ మాటలు, నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు….వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షల హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర అంటూ మండిపడ్డారు. శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టడానికే ఢిల్లీలో ధర్నా పేరుతో జగన్ డ్రామా చేస్తున్నారని ఆగ్రహించారు.

గత ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాలుగా హింసను అనుభవించారని… కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ప్రతి హామీ నెరవేర్చుతామని తెలిపారు. దళితుడైన డ్రైవర్ ను వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేసి డెడ్ బాడీని ఇంటికి పార్శిల్ పంపినపుడు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి చట్టం గుర్తుకు రాలేదా..? అంటూ ఆగ్రహించారు నాగబాబు.

గత ప్రభుత్వంలో మాస్కులు కావాలని అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్ర వేసి, ఆత్మహత్య చేసుకునేలా చేసినపుడు ప్రశ్నించాలనే బుద్ధి ఈ జగన్ కి ఏమైంది…? తన అక్కను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని ప్రశ్నించిన 13 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ ను చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టినపుడు ఈ మాజీ సీఎం ఎక్కడున్నారు..? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో 32 వేల మంది ఆడపడుచులు అదృశ్యం అయ్యారని పవన్ కళ్యాణ్ లెక్కలతో సహా చెప్పినా- కనీసం దానిపై సమీక్ష కూడా చేయని ఈ వైసీపీ నాయకుడికి ఇప్పుడు తీరిక దొరికిందా..? అధికారం పోగానే ఇప్పుడు రాష్ట్రం గుర్తుకొచ్చిందా..? అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news