కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. రాజదాని అమరావతికి రూ 15 వేల కోట్ల ఆర్దిక సాయం చేస్తామని తెలిపారు. ఇక దీనిపై వైసీపీ నేతలు భిన్నంగా స్పందించారు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు గ్రాంటా? లేక అప్పా? అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా దీనిపై బిజెపి నేతలు క్లారిటీ ఇచ్చారు. ఇది లోన్ కాదని.. ఇది 100 శాతం గ్రాంట్ అని సీఎం రమేష్ స్పష్టం చేశారు.అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15,000 కోట్లు అప్పు కాదు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సిన పనిలేదు అని, దీనికి పూర్తి బాధ్యత కేంద్రమే అని ఆయన తెలిపారు.