పారిస్ ఒలింపిక్స్ 2024.. ప్రారంభ వేడుకలు లైవ్ కాస్టింగ్ ఎక్కడ చూడొచ్చంటే?

-

పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ క్రీడలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు ఈవెంట్లు జరుగుతున్నా.. అఫీషియల్ ఓపెనింగ్ సెరిమనీ ఇవాళ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్‌ నుంచి 117 మంది పోటీపడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈ సారి ఎన్ని పతకాలు వస్తాయో చూడాలి.

ఇవాళ ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడలను జియో సినిమా, స్పోర్ట్స్18 నెట్‌వర్క్, లాంటి సంస్థలు  లైవ్​ టెలికాస్ట్ చేయనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ ప్రారంభోత్సవ వేడుకలు రాత్రి 11 నుంచి టెలికాస్ట్ కానుంది. ఇక అథ్లెట్ల పరేడ్ పడవల్లో ఉంటుంది. ఇందులో సుమారు 94 పడవల్లో ప్లేయర్లు పయనిస్తారు. దాదాపు 10వేల 500 మంది అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో ఆడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా షార్ట్‌ వీడియోల ట్రెండ్‌ నడుస్తున్న వేళ యువతరం కోసం ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి.

పారిస్‌కు 150 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఎక్కడికక్కడ కృత్రిమ మేధతో కూడిన నిఘా వ్యవస్థను నెలకొల్పారు. 45వేలమంది పోలీసులు, 10 వేలమంది సైనికులు పారిస్‌కు పహారా కాస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news