భద్రాచలం వద్ద మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మొన్నటిదాకా 51 అడుగులకు చేరి ఆ తర్వాత మళ్లీ తగ్గి 47 అడుగులకు చేరిన నీటిమట్టం నిన్నటి నుంచి పెరుగుతూ వస్తోంది. నిన్న 48 అడుగులకు చేరగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇవాళ ఉదయం గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా 51 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత వారం రోజుల నుంచి భద్రాచలం వద్ద వరద నీటి మాట్టం పెరిగి ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. గత వారం రోజుల నుంచి భద్రాచలం దిగువ ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి.