తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త. టికెట్ల విషయంలో కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీ వాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేలా కీలక నిర్ణయానికి వచ్చింది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులకు టికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
దీంతో శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు దొరకనున్నాయన్న మాట. దీంతో తిరుమలశ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 65, 980 మంది భక్తులు దర్శించుకున్నారు. 27441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 4.21 కోట్లుగా నమోదు అయింది.