నిర్మలా సీతారామన్ అందంగా ఉంటారు.. సీపీఐ నాారాయణ సెన్షేషనల్ కామెంట్స్

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై సీపీఐ జాతీయ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ చాలా అందంగా ఉంటారు. అంతే అందంగా అబద్దాలు చెబుతారు అని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీల పాలిత రాష్ట్రాలకు తప్పా మిగిలిన రాష్ట్రాలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపులో అన్యాయం చేశారని పేర్కొన్నారు.

కూటమిలో చంద్రబాబు, నితీష్ లేకపోయి ఉంటే.. ప్రభుత్వం పడిపోతుందని విమర్శించారు నారాయణ. మోడీతో ప్రెండ్ షిప్ మాత్రమే కాదని.. రాష్ట్రానికి చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావాలని సూచించారు. అనంతరం మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం పై సీపీఐ నారాయణ స్పందించారు. ఫైళ్లు తగులబెట్టడం రాష్ట్రంలో కామన్ అయిపోయిందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఎన్నికల ఫలితాలప్పుడు ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే నెల 04వ తేదీన మదనపల్లి బాధితులను కలుస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news