ఏడుపు ఎందుకు సబితమ్మా.. అంటూ కాంగ్రెస్ ట్వీట్..!

-

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబిలీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తది అని సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సబితా అసెంబ్లీలో స్పందిస్తూ.. కంటతడి పెట్టారు. రేవంత్ రెడ్డిని  నువ్వు చాలా గొప్పోడివి అవుతావు అని అక్కలా ఆశీర్వదించా. కానీ రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అంటూ  సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు మీడియా వద్దకు కూడా వెళ్లి ఏడ్చారు సబితా ఇంద్రారెడ్డి.

తాాజాగా దీనిపై టీ కాంగ్రెస్ స్పందిస్తూ.. ఓ ట్వీట్ చేసింది. ఏడుపు ఎందుకు సబితమ్మా..? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసినందుకా..? కష్టకాలంలో కాంగ్రెస్ ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరినందుకా..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినందుకా..? నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా అంటూ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news