ఈ నెల 5న తేదీ సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండనుంది. రాష్ట్రంలో నూతనంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంటుంది. కలెక్టర్ల కాన్ఫరెన్సుకు మంత్రులు హాజరు కానున్నారు.
సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమీక్ష ఉంటుంది. కలెక్టర్ కాన్ఫరెన్స్ కు కావాలిసిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పెషల్ సీఎస్ సిసోడియా ఆదేశాలు ఇచ్చారు.
గత ప్రభుత్వ హయంలో జిల్లాల్లో భూములు, మైన్స్, ఇసుక, సహజ వనరుల దోపిడీ జరిగిందని గుర్తింంచారు. ఆయా అంశాలపై పై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రత్యేకం ఫోకస్ పెట్టనున్నారు సిఎం చంద్రబాబు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలతో జిల్లాల్లో శాంతి భద్రతలు, గంజాయి సాగు, అమ్మకాలపై కట్టడి వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ ఉంటుంది.