రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం చేశాడు : సీఎం రేవంత్ రెడ్డి

-

రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం చేశాడని తెలంగాణ సీఎం.రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో గుర్తు చేశారు. సాంకేతిక యుగంలో 21వ సెంచరీకి ఈ దేశంలో ఉండే కోట్లాడి మంది యువతీ, యువకులను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైటెక్ సిటీకి పునాదులు వేసింది నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని గుర్తుకు చేసారు సీఎం రేవంత్ రెడ్డి.

సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నేడు బాధ్యత తీసుకుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉంటాయో చెప్పేశాడు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా  దీంట్లో దాదాపుగా 17 కోర్సులు మేము ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఈ 17 కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వీటి నిర్వాహణ కోసం పీపీబీ మోడల్ తీసుకొచ్చామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news