హైదరాబాద్ లో దారుణం జరిగింది. గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంది హిల్స్ నుండి వేగంగా వచ్చి మార్కం చెరువు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి ను వేగంగా ఢీ కొట్టింది కారు. దీంతో నుజ్జు నుజ్జు అయింది ఆ కారు.

కారు నడుపుతున్న యువకుడు స్పాట్ లో మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. మృతుడు ICFAI యూనివర్సిటీ లో BBA చదువుతున్న విద్యార్థి చరణ్(19)గా పోలీసులు గుర్తించారు. BNR హిల్స్ నుండి స్విఫ్ట్ డిజైర్ కారులో మెహది పట్నం లోని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలిపారు పోలీసులు.
ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో రాయదుర్గం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.