ఇంటెల్‌లో భారీ లేఆఫ్స్.. 18వేల మందికి ఉద్వాసన!

-

అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ భారీ లేఆఫ్స్కు రంగం సిద్ధం చేసింది. దాదాపుగా 18వేల మందిని ఒకేసారి తొలగించనుంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 15 శాతానికి సమానం కావడం గమనార్హం. ఉద్యోగుల తొలగింపుల వల్ల కంపెనీకి ఏటా 20 బిలియన్‌ డాలర్ల వ్యయాలు ఆదా అవుతాయని అంచనా వేసింది.

ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు రావడం.. రెండో త్రైమాసిక నిరాశాజనక ఫలితాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలో అనే మైలురాళ్లను సాధించినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లతో కూడుకొన్న పరిస్థితులను ఎదుర్కోనున్నట్లు వెల్లడించింది. ఏఐ ఆధారిత చిప్‌ల ఉత్పత్తిలో సవాళ్లు, తమ తయారీ కేంద్రాల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోవడం వల్ల రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయని ఇంటెల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి డేవిడ్‌ జిన్సర్‌ అన్నారు. ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాభాలను మెరుగుపర్చుకోవటంతో పాటు బ్యాలెన్స్‌ షీట్‌ను బలోపేతం చేసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news