ఎంత సంపాదిస్తున్నా అంతకు తగ్గ ఖర్చులతో విసిగిపోయి ప్రతీ రోజు అందరు అనుకునే మాట, చిన్న పనికి కూడా పెద్ద వేతనం ఉంటే బాగుంటుందని. లేదా ఏదైనా లాటరీ తగిలితే బాగుండు ఇంత కష్టపడకర్లేదు అనుకుంటారు. అలంటి వారికి ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాచ్చు. మేము పెట్టే కాంటెస్ట్ లో పాల్గొని ఈ సమస్యకి సొల్యూషన్ చెప్పండి, మేమే మీకు అక్షరాల రూ. 35 లక్షలు ఇస్తాము అంటున్నారు బిల్ గేట్స్ ఫౌండేషన్ వారు. అసలు కధ ఏంటంటే..
భారతదేశంలో యూపిఐ పేమెంట్ ని మేనేజ్ చేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – NPCI, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, CIICOO వారు కలిసి చేయబోయే ఓ ప్రాజెక్ట్ కోసం ఈ కాంటెస్ట్ ని పెట్టారు. UPI పేమెంట్స్ లావాదేవీలు మొత్తం స్మార్ట్ ఫోన్స్ లోనే జరుగుతాయి. ఫీచర్ ఫోన్ ఉన్నవాళ్ళకి ఈ అవకాశం లేదు, కాని సగంమందికి పైగా ఫీచర్ ఫోన్ వాడుతున్నవారే ఉన్నారు. ఇప్పుడు ఫీచర్ ఫోన్ కి కూడా UPI పేమెంట్స్ చేసేలా ఒక సాఫ్ట్ వారే ని తాయారు చేయటమే ఈ కాంటెస్ట్.
ఈ కాంటెస్ట్ లో ఎవరైనా పాల్గొనవచ్చు. డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా ఎవరైతే ఫీచర్ ఫోన్ కి సాఫ్ట్ వేర్ తాయారు చేస్తారో వారికీ 50,000 డాలర్లు అంటే సుమారుగా రూ.35.85 లక్షలు అందజేస్తారు. ఇది మొదటి బహుమతి మాత్రమే, రెండో బహుమతి 30,000 డాలర్లు (రూ.21.5 లక్షలు), మూడవ బహుమతి 20,000 డాలర్లు(రూ.14.34 లక్షలు) ఇస్తారు. ఈ కాంపిటీషన్ 2020 జనవారి 12 న ముగియనుంది. 2020 మార్చి 14న విజేతలను ప్రకటిస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం.