ఊహించని దెబ్బ కొట్టిన జగన్, షాక్ లో తెలుగుదేశం…!

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ మరో షాక్ ఇచ్చారు. రాజధాని మార్పు ఉంటుంది అనే విషయాన్ని ఆయన పరోక్షంగా ఏలూరు లో చెప్పడంతో ఒక్కసారిగా తెలుగుదేశం నేతలు కంగు తిన్నారు. ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత ఇప్పటి వరకు సరైన స్పష్టత అనేది ప్రభుత్వం నుంచి రాలేదు. అటు విశాఖ ఉత్సవ్ కి వెళ్ళినా, కేబినేట్ మీటింగ్ జరిగినా సరే, జగన్ నుంచి పెద్దగా స్పందన రాలేదు.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇది వాడుకునే ప్రయత్నం ఎక్కువగానే చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారు అని చెప్పే ప్రయత్నం చేసింది. రాజకీయంగా దీనిని వాడుకునే ప్రయత్నం తెలుగుదేశం చేసింది అనేది వాస్తవం. ఇక రాయలసీమ నేతలు కూడా మాకు హైకోర్ట్ వలన ఏ విధమైన ఉపయోగం లేదని చెప్పే ప్రయత్నం చేసారు. కాని అనూహ్యంగా జగన్ శుక్రవారం తెలుగుదేశం ఆశలకు గండికొట్టారు.

ఏలూరులో ఒక సభలో మాట్లాడిన జగన్ రాజధాని తరలింపు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దీనితో తెలుగుదేశం ఇప్పుడు ఆత్మరక్షణ లో పడిపోయింది. రాజధాని విషయంలో కేంద్రం ఎంటర్ అయింది, అమిత్ షా రంగంలోకి దిగారు అంటూ మాట్లాడిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు అనూహ్యంగా జగన్ చేసిన ప్రకటన తో షాక్ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా జగన్ క్లారిటి ఇచ్చేసారు. రాజధాని తరలింపు అనేది దాదాపుగా ఖరారు అయినట్టే కనపడుతుంది. దీనితో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజధాని మార్పుని ఆపలేదు కాబట్టి సెంట్రల్ ఆంధ్రా లో కూడా బలహీనపడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news