జీహెచ్ఎంసీ లో వచ్చే డబ్బులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఖర్చు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే నిధులు సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్, డిప్యూటీ సీఎం నియోజక వర్గం మధిరలకు ఎందుకు పోతున్నాయని ప్రశ్నించారు.
BRS నేతలు ధర్నా లు చేయాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకొని ఉండరు. బీఆర్ఎస్ వాళ్లు ఎగెరిగిరి పడితే వారి పరిస్థితి ఏందో అర్థం కావడం లేదా మీకు. నిజాం అకృత్యాలు మీకు గుర్తుకు రావడం లేదా రేవంత్ రెడ్డి..? అక్బరుద్దీన్ చూస్తే గజ గజ లాడుతున్నవా..? నయా నిజాం లెక్క మాట్లాడుతున్నావ్. నోరు, ఒళ్ళు ఉందని ఇష్టమొచ్చినట్టు అసెంబ్లీ లో మాట్లాడిన వారిని 5 సంవత్సరాలు పోటీ చేయకుండా సస్పెండ్ చేయాలి. GHMC లో 500 కోట్ల యాడ్ స్కాం జరిగింది. కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డీ నీ ఎందుకు కలవలేదు..? అసెంబ్లీ లో కిషన్ రెడ్డి గురుంచి మాట్లాడడం అయన అవకాశవాదానికి నిదర్శనం అన్నారు.