పారిస్ ఒలింపిక్స్ 2024.. బాక్సర్ నిశాంత్ దేవ్‌ ఓటమి వివాదాస్పదం

-

పారిస్ ఒలింపిక్స్‌లో అత్యద్భుత పర్ఫామెన్స్ ఇచ్చినా.. భారత్ బాక్సర్ నిశాంత్‌ దేవ్‌కు ఓటమి తప్పలేదు. 71 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌లో మెక్సికో బాక్సర్‌ మార్కో వెర్డే చేతిలో 4-1 తేడాతో నిశాంత్‌ ఓడిపోయాడు. ప్రతి రౌండ్‌లోనూ మెరుగ్గానే రాణించినా.. జడ్జీలు మాత్రం వెర్డెను విజేతగా ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిశాంత్‌కు భారత మాజీ ఛాంపియన్‌ విజేందర్‌ సింగ్, బాలీవుడ్ నటుడు రణ్‌దీప్‌ హుడా మద్దతుగా నిలిచారు.

‘‘అసలు స్కోరింగ్‌ సిస్టమ్ ఎలా చేశారో అర్థం కావడం లేదు. ఇది గొప్ప ఫైట్‌. నిశాంత్‌ చాలా అద్భుతంగా పోరాడాడు. బాధపడొద్దు నిశాంత్’’ అని విజేందర్‌ అన్నారు. ‘‘ఈ పోటీలో నిశాంత్‌ విజయం సాధించాడు. స్కోరింగ్‌ విధానం సరైందేనా? నీ నుంచి పతకాన్ని దోచేశారు. కానీ, నువ్వు మా మనసులను గెలిచావు. అత్యంత బాధాకరం. ఇలాంటివి చాలా జరిగాయి’’ అని బాలీవుడ్‌ స్టార్ రణ్‌దీప్‌ హుడా ఒలింపిక్‌ కమిటీపై కాస్త ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ వివాదం చర్చనీయాంశమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news