తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..త్వరలోనే కొత్త పెన్షన్లు ప్రారంభం !

-

తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. త్వరలోనే కొత్త పెన్షన్లు ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పెన్షన్లతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని వెల్లడించారు.

Good news for the people of Telangana..New pensions will start soon

ఇప్పటికే దీని పైన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామని కూడా వెల్లడించారు భట్టి విక్రమార్క. ప్రజావాణిలో ఎక్కువగా ఈ సమస్యల పైన ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చౌక ధరల దుకాణాలలో రేషన్ తీసుకునేందుకు అలాగే సంక్షేమ పథకాలను పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఉండాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని వివరించారు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news