మధిర ప్రజలకు గుడ్ న్యూస్.. పెద్ద నగరంగా తీర్చిదిద్దుతా : డిప్యూటీ సీఎం భట్టి

-

మధిరా నియోజకవర్గ ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. స్వశక్తిగా వ్యాపారం చేసుకునేందుకు 84 ఎకరాల్లో 45 కోట్ల తో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.  మధిర నియోజకవర్గం వ్యవసాయం రంగంతో పాటు పారిశ్రామికగా అభివృద్ధి చెందాలి.రాష్ట్రంలో యువత, మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. లక్ష కోట్ల రుణాలు అందించేందుకే ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. మధిర లో బైపాస్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

రెండు రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్న మధిర పట్టణం ఇండస్ట్రియల్ పార్కు ద్వారా ఇంకా నగర స్థాయిలోకి అభివృద్ధి చెందుతుంది.  ఇటు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులకి జంక్షన్ గా మదిర కేంద్రాన్ని
అభివృద్ధి చేస్తామన్నారు. మధిర ని పెద్ద నగరంగా తయారు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మధిర చుట్టూ రింగ్ రోడ్ల ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం ఒక కార్యచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నాం. విద్య, వైద్య పరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నది.
ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రాన్ని కూడా మధిర లో ఏర్పాటు చేస్తున్నాం. కొల్డ్ స్టోరీ నిర్మాణం చేపడతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news