భద్రత తగ్గించటంపై హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్..!

-

ప్రభుత్వం తన భద్రత తగ్గించటంపై వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ పలు అంశాలు పేర్కొన్నారు. జూన్ 3వ తేదీ వరకు నాకు జడ్ ప్లస్ భద్రత ఉండేది. కానీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన జూన్ 4 తర్వాత సెక్యూరిటీ సంఖ్య 58కి కుదించారు అని పేర్కొన్నారు. 2019లో విశాఖ ఎయిర్ పోర్ట్ లో నాపై దాడి జరిగింది. 2024 ఎన్నికల ప్రచారంలో సీఎంగా ఉన్న నాపై రాయితో దాడి చేస్తే హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా నా సెక్యూరిటీ కుదించారు అని జగన్ పేర్కొన్నారు.

సెక్యూరిటీ తగ్గింపు పై ఎలాంటి నోటీసు సమాచారం ఇవ్వకుండా కుదించారు. ఇల్లు, కార్యాలయం దగ్గర భద్రత తొలగించారు. ప్రభుత్వం గతంలో జరిగిన పరిస్థితులను పరిశీలనలోకి తీసుకుంటే అక్కడ భద్రత పునరుద్ధరణ జరిగేది. నన్ను భౌతికంగా లేకుండా చేయటం కోసమే అధికార పార్టీ ఇలా చేస్తోందని అనిపిస్తోంది. ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే సంభాషణల్లో భాగంగా జగన్ ఓడాడు.. తప్ప చావలేదు.. చచ్చే వరకు కొట్టాలి అని చెప్పిన వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయి. ప్రజలతో మమేకం కావాలనుకునే నాపై వ్యక్తిగత దాడులు ప్రోత్సహించేలా ఈ చర్యలు ఉన్నాయి అని జగన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news