గంజాయి సేవిస్తున్నారా.? ఇక నుంచి తప్పించుకోలేరు..!

-

సాధారణంగా కొంత మందికి మద్యం సేవించడంతో గంజాయి, గుట్కా, పాన్ మసాలా ఇలాంటి అలవాట్లు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ అలవాట్లు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు లేకుండా చేయాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని  పోలీస్ స్టేషన్లలో కొత్త గంజాయి టెస్ట్ మిషన్లు రాబోతున్నట్టు సమాచారం. గంజాయి, డ్రగ్స్‌ను సమూలంగా అరికట్టేలా తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ మాదిరిగా గంజాయి టెస్టింగ్ కిట్‌లను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. గంజాయి తాగిన వ్యక్తి యూరిన్‌ (మూత్రం) పరీక్ష చేస్తే గంజాయి, డ్రగ్స్ నమూనాలు బయటపడతాయి. దాదాపు 12 రకాల మత్తు పదార్థాలను ఈ కిట్  ద్వారా గుర్తించవచ్చు. నెల నుంచి ఆరు నెలల లోపు గంజాయి సేవించినా.. ఈ కిట్ పరీక్షల్లో తెలిసిపోతుంది. అందుకే గంజాయి సేవించవద్దని పలువురు అధికారులు పదే పదే చెబుతున్నారు. ఇక నుంచి అయినా గంజాయిని మానేయండి.

Read more RELATED
Recommended to you

Latest news