ఆగస్టు 15.. మన స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచినట్లు తెలిపారు. ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచాం. కాబట్టి ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.
ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేెశాం. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తాం. అదే విధంగా పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత చెప్పాలి. పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.