కమలానికి కొత్త సారథి ఆయనేనా..? ఈటెల వైపు అమిత్ షా మొగ్గు..

-

నిజాం కోటపై కమలం జెండాను ఎగరేసేందుకు బిజెపి నేతలు కొన్నేలుగా ఎదురుచూస్తున్నారు.. ప్రతి ఐదేళ్ల కు జరిగే ఎన్నికల్లో బిజెపి ఓటు షేర్ పెంచుకుంటుంది తప్ప.. ఆశించిన స్థాయిలో బలోపేతం కాలేకపోతోంది.. ఈసారి బలమైన నాయకత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం అడుగులు వేస్తోంది.. రాష్ట్రానికి కొత్త అధ్యక్షుని నియమించాలని ఆ పార్టీ భావిస్తోంది.. అయితే నూతన అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారనే చర్చ తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.. గ్రామస్థాయి క్యాడర్ లో కూడా నిస్తేజం నెలకొన్న నేపథ్యంలో త్వరలోనే అధ్యక్ష పదవి నియామకం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

etela rajender amit shah

ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు.. కేంద్రమంత్రిగా, జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇన్చార్జిగా ఆయన అదనపు బాధ్యతలు మోస్తున్నారు.. దీంతో రాష్ట్రంలో ఉండే నేతలకు ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు.. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి సైతం అధిష్టానానికి విన్నవించుకున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. వీలైనంత త్వరగా తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. కొత్తవారికి పదవి కట్టబెట్టాలని ఆయన కోరారట.. దింతో బిజెపి నాయకత్వం అనుభవజ్ఞులైన నేతల కోసం అన్వేషణ ప్రారంభించారని తెలుస్తుంది.

ఈ పదవి కోసం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. తమకు ఒక్క అవకాశం కల్పించాలని.. వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు పార్టీని చేరువ చేస్తామని చెబుతున్నారట.. బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందున.. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని బిజెపి నేతలు అంటున్నారు.. ఈ క్రమంలో ఈటెల రాజేంద్ర పేరు తెరమీదకు వస్తోంది.

తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన, అనుభవం కలిగిన నేతగా ఉన్న రాజేంద్ర వైపే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ముగ్గు చూపుతున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీతో పాటు టిఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవాలంటే ఈటెల రాజేందర్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉంటేనే సాధ్యమవుతుందని అధిష్టానం నమ్ముతుందట.. ఈ క్రమంలో ఆయన పేరు దాదాపు ఖరారు అయిందని బిజెపిలో ప్రచారం నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news