జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే… రోబోలతో ప్రజలను తరిమి కొట్టేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి నేత బుద్దా వెంకన్న. ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపాడని… పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాలేదు పదవి పోయి….అప్పుడే మతి భ్రమించి.. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహం పెట్టి కేవలం తన పేరే పట్టుకున్నాడని…. అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉందని వెల్లడించారు టిడిపి నేత బుద్దా వెంకన్న.
అందుకే అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చు…జగన్ తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని…ఆగ్రహించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్ అని… గతంలో అమరావతి లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు. జగన్ వచ్చాక 404 కోట్లతో విజయవాడ లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు.. ఇందులో కూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అంటూ విమర్శలు చేశారు టిడిపి నేత బుద్దా వెంకన్న.